![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -337 లో..... సీతాకాంత్ సిరి ఫోటో చూస్తూ.. తన బాధని చెప్పుకుంటాడు. రామలక్ష్మి ఏమైనా నన్ను తప్పుగా అర్థం చేసుకుందేమో వెళ్లి అర్ధమయ్యేలా చెప్పాలి. తనే రామలక్ష్మి అని చెప్పించాలని సీతాకాంత్ అనుకుంటాడు. అలా సీతాకాంత్ సిరి ఫోటో దగ్గర ఏదో మాట్లాడుకోవడం.. శ్రీవల్లి, శ్రీలత లు చూస్తారు. ఎన్నడు లేనిది బావగారు ఈ రోజు ఇలా ఉన్నారని శ్రీవల్లి అంటుంది.
సిరి అన్న నేనన్న ఇష్టం కదా అందుకే అలా అని శ్రీలత అనగానే.. మీ కంటే ఎక్కువ ఆ రామలక్ష్మి అని శ్రీవల్లి అంటుంది. రామ్ అమ్మ కావాలంటున్నాడు మళ్ళీ మనకేదో కష్టాలు మొదలవుతన్నాయనిపిస్తుందని శ్రీవల్లి అంటుంది. ఎందుకు అలా అంటావంటూ శ్రీలత కోప్పడుతుంది. సీతాకాంత్ రామ్ ని స్కూల్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడే రామ్ ఫ్రెండ్ వాళ్ల మమ్మీ వస్తుంది. తను తన అబ్బాయి టీసీ కోసం వస్తుంది. రామ్ తనని అంటీ అంటుంటే నన్ను అంటీ అనకు.. నా పేరు మమత కదా.. మామ్ అని స్టైల్ గా అను అని ఆవిడ అంటుంది. మమత, రామ్ సీతాకాంత్ ముగ్గురు కలిసి వస్తుంటే రామలక్ష్మి చూసి రామ్ వాళ్ల మమ్మీ తనేనేమో అని అనుకు.టుంది. మమతకి కంట్లో ఏదో పడితే సీతాకాంత్ తీస్తాడు. దాంతో రామలక్ష్మి కోపం వచ్చి లోపలికి వెళ్తుంది. సీతాకాంత్ ఫోన్ వస్తే పక్కకి వెళ్తాడు. రామలక్ష్మి దగ్గరికి రామ్ వెళ్ళగానే మీ మామ్ ని రమ్మని చెప్పు అంటుంది. ఈవిడ కూడా మామ్ అని పిలుస్తుందా అని రామ్ అనుకుంటాడు. మీ అబ్బాయి ఏం చేసాడో తెలుసా అంటూ రామ్ గురించి రామలక్ష్మి మమతకి చెప్తుంది. మా అబ్బాయి అలాంటి వాడు కాదని మమత అంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి.. రామ్ మమత చీర కొంగుపై నిలబడి ఉంటే.. రామ్ ని పక్కకి జరిపి కొంగు దులిపి మమతకి ఇస్తాడు. దాంతో రామలక్ష్మికి ఇంకా కోపం వస్తుంది. మా అబ్బాయికి టీసీ ఇవ్వమని మమత తన అబ్బాయి రోషన్ గురించి మాట్లాడుతుంటే.. రామలక్ష్మి మాత్రం రామ్ అనుకొని టీసీ ఇవ్వడం కుదరదంటూ కోపంగా వెళ్లిపోతుంది. ఇంకొక టీచర్ కి మాకూ బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది టీసీ అడిగితే ఆవిడేంటి అలా కోపంగా వెళ్తుందని మమత చెప్పాగానే.. నేను చూసుకుంటా మీరు వెళ్ళండి అని మమతని పంపిస్తుంది.
ఆ తర్వాత రామలక్ష్మి పక్కకి వచ్చి ఫ్రస్ట్రేషన్ అవుతుంటే.. రామ్, సీతాకాంత్ చూస్తారు. మా మేడం ఎందుకు చాలా కోపంగా ఉందని రామలక్ష్మి దగ్గరికి వెళ్లి తనకి స్ట్రస్ బాలు చేతిలో పెడతాడు. ఎందుకు రామలక్ష్మి ఇంత కోపంగా ఉందని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఒంటరిగా నడుచుకుంటూ సీతా సర్ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారంటూ తనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుంది. అప్పుడే వెనకాల నుండి రామలక్ష్మి అంటూ సీతాకాంత్ పిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |